tree tops

మా గురించి

శ్రీ వెంకటేశ్వర యూకలిప్టస్ క్లోనల్స్ & నర్సరీ వివరాలలోకి వెళ్లడానికి ముందు, మనము దాని స్థాపకులు శ్రీ రామచంద్ర రావు బొప్పన గారి గురించి తెలుసుకోవాలి ......

శ్రీ రామచంద్ర రావు బొప్పన గారు ఒక సామాన్య రైతు కుటుంబము లో జన్మించినారు. వ్యవసాయం పట్ల ఉత్సాహం మరియు తృష్ణ అతనిని వ్యవసాయ కార్యకలాపాలను ఆధునిక పద్ధతులలో నిర్వహించి వివిధ అవార్డులు గెలుచుకొనేలా చేసాయి. స్వయంగా రైతు కావుట వలన మంచి దిగుబడి సాధించడానికి సరియైన క్లోన్ / విత్తనం యొక్క ప్రాముఖ్యత గుర్తించినారు. తన అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత గల యూకలిప్టస్ క్లోన్స్ అభివృద్ధి చేసుకొనుటకు 1983 సంవత్సరములో శ్రీ వెంకటేశ్వర యూకలిప్టస్ క్లోనల్స్ & నర్సరీ ప్రారంభించి విజయము సాధించి తన విజయమును ఇతర రైతులతో పంచుకొనిరి.

వ్యవసాయములో మరియు నర్సరీని నడుపుటలో విశేష అనుభవము మరియు విజయము సాధించిన తరువాత రామచంద్ర రావు గారు శ్రీ వెంకటేశ్వర యూకలిప్టస్ క్లోనల్స్ & నర్సరీని వివిధ రకాల క్లోనులను అభివృద్ధి పరిచి, వాటి నాణ్యత మరియు సామర్థ్యం పెంచడానికి మరియు అన్ని ప్రాంతాల రైతులకు అందించడానికి - గ్రీన్ హౌసులు, పోలిహౌసులు, ఆటో టైమర్లు, స్ప్రింక్లర్లు, మంచి నీటి చెరువు, ఇసుక ఫిల్టర్లు వంటి మరిన్ని ఆధునిక వసతులతో కూడిన అత్యాధునిక నర్సరీగా అభివృద్ధి పరిచినారు.

మేము సరఫరా చేసే నాణ్యత మరియు మేము రైతులు నుంచి పొందిన విశ్వాసం మమ్ములను గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక & తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో మా ఖాతాదారుల వ్యాప్తికి దోహదం చేసింది. మేము మా వ్యాపారం యొక్క విజయం మా రైతుల ద్వారానే వస్తుంది అని గర్వంగా చెప్పగలము.

రైతులకు కేవలం మొక్కల అమ్మకానికి మాత్రమే పరిమితము కాకుండా, మేము వారి ప్రాంతమునకు అనుకూలమైన క్లోన్ రకమును ఎంచుకొనుటలో, నీటిపారుదల ప్రణాళిక, క్లోన్ యొక్క రవాణా మరియు తోటలను విజయవంతముగా పెంచుటలో రైతులకు సహాయము అందించెదము. మొక్కలు నాటిన తరువాత కూడా రైతులతో మా సంబంధము నిరంతరం కొనసాగుతుంది. వారికి యూకలిప్టస్ తోటల సస్యరక్షణలో ఏమన్నా సమస్యలు ఉన్న యెడల, మా అనుభవం ఆధారముగా రైతులు వాటిని అధిగమించడానికి అవసరమైన సూచనలను సలహాలను అందిస్తాము. మా విజయ సూత్రాన్ని ఇతర రైతులతో పంచుకునేందుకు సంతోషిస్తున్నాము మరియు అదే సమయంలో మేము కూడా ఇతర రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను తెలుసుకొని వాటిని అమలుపరుస్తాము.