tree tops

మా నర్సరీకి స్వాగతము

శ్రీ వెంకటేశ్వర క్లోనల్స్ & నర్సరీ 1983 వ సంవత్సరములో ప్రారంభించినారు. యూకలిప్టస్ తోటల సాగులోకి ప్రవేశించదలచిన రైతుల కొరకు బహుళ రకాల మరియు అధిక నాణ్యత కలిగిన యూకలిప్టస్ క్లోన్స్ (మొక్కల) అభివృద్ధి లక్ష్యంతో గ్రీన్ హౌసెస్, పోలి హౌసెస్ మరియు ఓపెన్ హౌసెస్ వంటి అత్యాధునిక వసతులతో కూడిన ఆధునిక నర్సరీ కింద అభివృద్ధిపరచటమైనది.

ఏడాదికి 60 లక్షల అధిక నాణ్యత కలిగిన యూకలిప్టస్ క్లోన్స్ ఉత్పత్తి సామర్థ్యముతో ఆంధ్రప్రదేశ్ లో మేము ప్రముఖ యూకలిప్టస్ క్లోన్స్ తయారీదారులలో ఒకరము . దీని వలన గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు & ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రైతు సోదరులకు అధిక నాణ్యత కలిగిన యూకలిప్టస్ క్లోన్స్ ను భారీ పరిణామములో నిరంతరముగా సరఫరా చేయగలుగుతున్నాము.

సాధారణ పద్ధతులతో పరిమితము కాకుండా యూకలిప్టస్ క్లోన్స్ అభివృద్ధిలో ఉద్భవిస్తున్న తాజా మరియు నవీనమైన సాంకేతికతలతో మేము ఎప్పటికప్పుడు వృద్ధి చెందుచున్నాము. శిక్షణ పొందిన మరియు విశేష అనుభవము కల నిపుణులు సహాయముతో మేము కాండం ఎంపికలో అనుసరించే ప్రమాణాలు మరియు క్లోనింగ్ లో అనుసరించే ప్రక్రియలు క్రింది లక్షణాలు కలిగిన అధిక నాణ్యత కలిగిన యూకలిప్టస్ క్లోన్స్ అందించడములో మాకు సహాయపడుతున్నాయి :

  • అధిక మనుగడ స్థాయి
  • త్వరిత పెరుగుదల
  • గరిష్ట ఎత్తు మరియు వెడల్పు సాధించుట
  • అధిక ఉత్పాదకత
  • అన్ని రకముల వాతావరణ మరియు ప్రాంతములకు అనుకూలము
  • వ్యాధులను తట్టుకొను శక్తి