tree tops

మా సేవలు

30 సంవత్సరాలలో మేము సంపాదించిన క్షేత్ర స్థాయి అనుభవాన్ని ఉపయోగించి రైతులకు ఈ క్రింది రంగాలలో సహాయము అందిస్తాము ......

  • క్లోన్ ఎంపిక : ప్రతి ప్రాంతము వాటి వాటి సొంత వాతావరణ పరిస్థితులు మరియు నేల స్వభావము కలిగియున్నది. అనుభవజ్ఞులైన మా సాంకేతిక బృందము రైతులకు వారి ప్రాంతమునకు అనుకూలమైన నిర్దిష్ట రకమును సూచిస్తుంది.
  • నీటి వ్యవస్థ ప్రణాళిక : మేము రైతులకు వారి నేల స్వభావము, నీటి వనరు, నీటి నాణ్యత, వాతావరణ పరిస్థితులు, నాటిన క్లోను రకము ను బట్టి వారు అనుసరించాల్సిన నీటి వ్యవస్థ ప్రణాళికను రూపొందిస్తాము.
  • క్లోనుల రవాణా : మా నర్సరీ నుండి రైతు యొక్క సైట్ వరకు క్లోనుల రవాణా ఏర్పాటు చేయగలము. క్లోనులను రవాణా చేయు సమయములో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పూర్తి అవగాహన కలిగిన రవాణాదారుల ద్వారా మేము క్లోనులను సురక్షితముగా రైతుల వద్దకు చేర్చెదము. దీని వలన మొక్కల మరణాల సంఖ్య తగ్గుతుంది.
  • మొక్కలు నాటుట : క్లోనులను జాగ్రత్తగా క్రమపద్ధతిలో నాతుటలో అనుభవము కలిగిన వారిని ఏర్పాటు చేయగలము. దీని వలన మొక్కల యొక్క మనుగడ సంఖ్య మెరుగుపడును.
  • పంట సంరక్షణ సూచనలు : యూకలిప్టస్ తోటల నుండి విజయవంతమైన, నిరంతర మరియు స్థిరమైన దిగుబడులు పొందుటకు అనుసరించవలసిన పద్ధతుల గురించి రైతులకు మార్గదర్శకత్వము ఇస్తాము.
  • రైతులకు మా సేవలు మొక్కలు నాటడము పూర్తయిన తర్వాత కూడా కొనసాగుతాయి. అధిక దిగుబడి సాదించి, దానిని సరియైన సమయములో సరియైన ధరకు అమ్ముకొని మంచి లాభాలు గడించడములో సహకరిస్తాము. రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యలను అధిగమించుటకు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. మేము మా విజయమును రైతులు యూకలిప్టస్ తోటలలో సాధించిన ప్రగతితో సరిచూసుకుoటాము.

క్లోను రకములు

క్లోను నెం. 413 : ఇది కఠిన భూములు మరియు క్షార నేలలకు అనువర్తన యోగ్యమైన ఉత్తమ రకము.
క్లోను నెం. 7 : ఏ వ్యాధులకు ప్రభావితము కాకుండా మంచి ఎత్తు మరియు వెడల్పు కాండము సులభంగా సాధించి, ఫలితముగా మంచి దిగుబడులు ఇవ్వగల ఉత్తమ రకం.
క్లోను నెం. 3 : ఈ రకము వివిధ వ్యాధులకు ప్రభావితము కాకుండా అధిక ఉత్పాదకత ఇస్తుంది.
క్లోను నెం. 316 : ఇది కఠిన నేలలు మరియు క్షార భూములలో సైతం నిలదొక్కుకొని, అత్యధిక రోగ నిరోధక శక్తితో అధిక దిగుబడులు సాదించగల రకము.
క్లోను నెం. 288 : ఈ రకము వ్యాధులను తట్టుకుంటూ సప్ష్టమైన కాండముతో మంచి దిగుబడి ఇవ్వగలదు.
క్లోను నెం. 290 : క్షార నేలలలో మనుగడ సాదించి మరియు స్పష్టమైన కాండము పొందడం ద్వారా అధిక దిగుబడి ఇచ్చుటలో ఉత్తమ రకము.
No. 413 No. 7 No. 3 No. 316 No. 288 No. 290
గరిష్ట ఎత్తు మరియు వెడల్పు
అధిక ఉత్పాదకత
క్లిష్ట ప్రాంతాలలో అనువర్తన యోగ్యత
వ్యాధి నిరోధకత
క్షార నేలలు

ఆధారము : IUFRO