tree tops

క్లోనుల సంరక్షణ

అధిక దిగుబడి ఇచ్చే విజయవంతమైన క్లోనుల ఉత్పత్తి కోసం అవసరమైన అన్ని ఆధునిక పరికరాలతో పాటు శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన మరియు అంకితమైన పర్యవేక్షకులతో కూడిన ఒక ఆధునిక నర్సరీ ఎంతో కీలకము. అట్టి వసతులతో 60 లక్షల యూకలిప్టస్ క్లోన్ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కల అత్యాధునిక నర్సరీ స్థాపించబడినది.

క్లోనులను ప్రామాణికమైన విధానములను ఉపయోగించి అభివృద్ధి పరుస్తాము. దీని వలన క్లోన్ మనుగడ స్థాయి మరియు అధిక ఉత్పాదకత సామర్ధ్యము మెరుగుపడును.

క్లోనులను అభివృద్ధి పరుచటకు మా నర్సరీనందు 60,000 చదరపు అడుగులలో 30 మిస్ట్ చాంబర్లు, 15,000 చదరపు అడుగులలో గ్రీన్ హౌసులు, 1.25 ఎకరాలలో మంచి నీటి చెరువు మరియు 5 ఎకరాలలో ఓపెన్ హౌస్ నర్సరీ కలవు.

అధిక నాణ్యత గల క్లోనులను అభివృద్ధి పరచుటకు ఈ క్రింది విధానాలను పాటించెదము .......

మొక్క ఎంపిక - మంచి దిగుబడి సాధించడానికి సరియైన క్లోన్ ప్రాధాన్యతను గుర్తించడం వలన, జన్యుపరముగా మేలైన, విభిన్న వాతావరణాలు మరియు ప్రాంతాలకు అనుకూలమైన, స్థిరముగా అధిక దిగుబడినిచ్చె, వ్యాధి నిరోధకము కలిగిన చెట్టు యొక్క మొదటి కట్టింగ్సును మాత్రమే ఉపయోగించి క్లోనులను అభివృద్ధి పరిచెదము. అవసరమైన ఎత్తు మరియు వెడల్పుకు కత్తిరించి సరి చేయుట ద్వారా సేద్యం కోసం సిద్ధం చేయబడతాయి.

వెర్మికులైట్ ఉపయోగం - మేము విత్తనాల ట్రేలలో వెర్మికులైట్ ను ఉపయోగిస్తాము. ఇది గాలి, ఆహారము మరియు తేమ నిలబెట్టుకొని వాటిని మొక్కకు అవసరం ఉన్నప్పుడు విడుదల చేస్తుంది. దీని వలన వేర్లు వేగముగా వృద్ధి చెంది మూలాలు త్వరగా మరియు ధృడముగా నిలదొక్కుకుంటాయి.

మిస్ట్ ఛాంబర్స్ - మొక్కలతో నిండిన ట్రేలు 40 రోజుల కోసం ఫాగర్స్ బిగించిన పోలిహౌసులు / మిస్ట్ ఛాంబర్స్ కు మార్చబడతాయి. మొక్క ఎదుగుదల మరియు దాని భవిష్యత్ ఆధారపడి ఉండుట వలన ఇది ఎంతో కీలకమైన సమయం. అందుకోసం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వద్ద నిర్వహిస్తూ మొక్కలు సంరక్షించబడును.

గ్రీన్ హౌస్ - పిదప క్లోనులు గ్రీన్ హౌసులలో 15 రోజులు ఉంచబడతాయి. ఈ దశ మొక్కలు ఓపెన్ హౌస్ పరిస్థితులలో మనుగడకు సిద్ధం కావడానికి దోహదం చేస్తుంది.

ఓపెన్ హౌస్ నర్సరీ - చివరిదైన ఈ దశ 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ దశ క్లోను బాహ్య వాతావరణ పరిస్థితులకు అలవాటుపడి నిలదొక్కుకోవటానికి సహకరిస్తుంది.

గ్రేడింగ్ - పైన ప్రక్రియలు విజయవంతముగా పూర్తి చేసిన తరువాత, క్లోనులు తరగతులుగా వర్గీకరించబడతాయి. అవసరమైన నాణ్యతా ప్రమాణాలు (కాండం ఎత్తు & వెడల్పు) కలిగిన క్లోనులను మాత్రమే సేద్యం కోసం ఎంపిక చేసి రైతులకు సరఫరా కోసం ఉపయోగిస్తాము.

అధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన క్లోనును అభివృద్ధి పరచటానికి విశేష అనుభవము గల పర్యవేక్షకుల సంరక్షణలో క్లోనులు పైన పేర్కొన్న అన్ని దశలలో నిరంతరం పరిశీలించబడతాయి. ఫంగస్ వృద్ధి అణిచివేయటానికి మంచి నాణ్యత శిలీంద్రనాశకాలు ఉపయోగిస్తాము.

పై వాటితో పాటు, పరిసర కృష్ణా నది నుండి నీటిని తోడుకొని, నిల్వచేసుకొని వినియోగించుటకు 1.25 ఎకరాల విస్తీర్ణంలో సొంత మంచి నీటి చెరువును నిర్మించుకొన్నాము. మలినాలను తొలగించి నీటి నాణ్యత పెంచడానికి ఇసుక ఫిల్టర్లను అమర్చబడినవి. దీని వలన క్లోనులకు క్రమముగా ఏ ఆటంకము లేకుండా నాణ్యమైన నీటిని సరఫరా చేయగలుగుతున్నాము. క్లోనులకు మొదటి 3 నెలలు చాలా కీలకమైన సమయము కావుట వలన మేము నాణ్యమైన మంచి నీటి సరఫరా అతి ముఖ్యమైన అవసరముగా భావించి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ ఏర్పాటు చేసుకోవడమైనది.